Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి ఆకునూరి మురళీ రాజీనామా.. సీఎం జగన్‌కు లేఖ

ఏపీ ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళీ తన పదవికి రాజీనామా చేశారు. పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారుగా మురళీ ఉన్నారు. తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అక్కడి పరిస్థితి మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. తన సేవలు తెలంగాణలో అవసరం ఉందంటూ సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ సలహాదారుగా పనిచేయడం గొప్ప అనుభూతి అని.. సీఎం జగన్‌ పాఠశాల విద్యాశాఖ, ముఖ్యంగా నాడు-నేడుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇదే సమయంలో తన సొంత రాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని.. అందుకే తన సేవలు పూర్తిగా తెలంగాణలో అందించేందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img