Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వెల్లడిరచారు. కాగా మూడేళ్ల లా కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్‌ ర్యాంక్‌ను, కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. చీరాలకు చెందిన గొర్ల హారిబాబు, అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img