రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది.ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. 28న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.