Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఏపీ వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన

పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఫిట్‌మెంట్‌ 27 శాతం ఇవ్వాలని, ఇంటి అద్దె భత్యం కనీసం 12 శాతానికి పైగా ఉండాలని, సీపీఎస్‌ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) దశలవారీగా పోరాటాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… వారం రోజులపాటు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కొత్త పీఆర్సీ వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. హెచ్‌ఆర్‌ఏ కనీస శ్లాబు 12 శాతానికి పైగా ఉండాలని డిమాండు చేశారు. కలిసి వచ్చే ఉద్యోగులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. ఈనెల 11న కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తామని, 12న రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తమ డిమాండ్స్‌, హక్కులు సాధించుకుంటామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img