పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఏపీ సచివాలయంలో ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమం, యాప్ డౌన్ అంటూ ముందుకు వెళుతున్నారు.శనివారం నుంచి సహాయ నిరాకరణ చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. అయితే సచివాలయంలో శనివారం సెలవు కావడంతో శుక్రవారంమే సహాయ నిరాకరణ కార్యక్రమం నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయించారు. అందులోభాగంగా ఉద్యోగులు ఇవాళ సచివాలయంలో కంప్యూటర్లు షట్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. అలాగే ఉద్యోగులు సచివాలయంలో ఉన్న అన్ని బ్లాకుల్లో తిరుగుతూ ప్రభుత్వానికి, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.