Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన సిరివెన్నెల కుటుంబం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది. సిరివెన్నెల చికిత్స నిమిత్తం కిమ్స్‌ హాస్పిటల్‌లో అయిన ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వం భరించి, ఆపత్కాల సమయంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సిరివెన్నెల కుమారుడు సాయి యోగేశ్వర్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘ఈ కష్ట సమయంలో హాస్పిటల్‌ ఖర్చులు భరించి, మాకు అండగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రిగారికి ధన్యవాదాలు’ అని తెలిపారు. సీఎం సహాయ నిధి నుంచి సిరివెన్నెల వైద్య ఖర్చులు చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img