Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఏపీ సీఎస్‌, కేంద్ర జలశక్తి కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడం లేదన్న ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించింది.బాధితుల పట్ల మానవ హక్కులను పూర్తిగా ఉల్లంఘించినట్లుగా ఉందని అభిప్రాయపడిరది. ఇలాంటి విషయాల్లో తాము తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది. ఏపీ సీఎస్‌, కేంద్ర జలశక్తి కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోపు స్పందించకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని నోటీసుల్లో ఎన్‌హెచ్‌ఆర్సీ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img