Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

ఆరుగురు మృతి
ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరిశ్రమలోని యూనిట్‌`4లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయింది. మంటల ధాటికి ఆరుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనమవ్వగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు బీహార్‌ వాసులున్నట్లు గుర్తించారు. బాధితులను మొదట నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌ తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img