Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

ఏసు ప్ర‌భు జీవిత‌మే త్యాగానికి చిహ్నం.. సీఎం జ‌గ‌న్

క‌రుణామ‌యుడైన ఏసు ప్ర‌భు జీవిత‌మే త్యాగానికి చిహ్న‌మ‌న్నారు సీఎం జ‌గ‌న్. నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా జగన్ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. . ఆ ప్రభువుకు శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండు రోజులూ మానవాళి చరిత్రను మలుపుతిప్పిన ఘట్టాలని అన్నారు. తోటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగంౌ ఇదే మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశం అని చెప్పారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు జ‌గ‌న్.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img