Monday, June 5, 2023
Monday, June 5, 2023

ఒంగోలు డీఎస్‌పీగా అశోక్‌వర్ధన్ రెడ్డి.. డీఎస్‌పీ కార్యాలయంలో హైడ్రామా

ఒంగోలు డీఎస్‌పీ కార్యాలయంలో నేడు హైడ్రామా కనిపించింది. డీఎస్‌పీగా జాయిన్ అయ్యేందుకు వచ్చిన అశోక్‌వర్ధన్ రెడ్డికి కార్యాలయం అధికారులు స్వాగతం పరికారు. అయితే, ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం లేకపోవడంతో అశోక్‌వర్ధన్ రెడ్డి కాసేపు సీట్లో కూర్చుని వెళ్లిపోయారు.ఒంగోలు డీఎస్‌పీ పోస్టింగ్‌పై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నేరుగా సీఎం వద్దే ఆయన తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. డీఎస్‌పీగా హరినాథ్ రెడ్డి పేరును బాలినేని సూచించినట్టు సమాచారం. అయితే, తాను సూచించిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదని ఆయన కినుకు వహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అశోక్ వర్ధన్ రెడ్డి రాకపై డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img