Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ఒకేసారి 36 ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 23న (22 అర్ధరాత్రి తర్వాత) ఓ ప్రయోగం చేపట్టనుంది. బ్రిటిష్‌ స్టార్టప్‌ ‘వన్‌ వెబ్‌’కు చెందిన 36 బ్రాడ్‌ బ్యాండ్‌ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఇందుకోసం లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ 3 (ఎల్వీఎం3)ని ఉపయోగించనుంది. ఎల్వీఎం3ని గతంలో జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ 3 అని పిలిచేవారు.ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరికోట షార్‌ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇస్రోకి ఇది వాణిజ్య ప్రయోగం కానుంది. ఇస్రోకి చెందిన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) ద్వారా దీన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు వన్‌ వెబ్‌, ఎన్‌ఎస్‌ఐఎల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. వన్‌ వెబ్‌ బ్రిటిష్‌ స్టార్టప్‌ అయినప్పటికీ ఇందులో మెజారిటీ వాటాలు ఎయిర్‌ టెల్‌ ప్రమోటర్‌ అయిన భారతీ ఎంటర్‌ ప్రైజెస్‌ కు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img