ఓటీఎస్ అంటే చాలా మందికి అర్ధం తెలియదని… పేదలు కట్టుకున్న ఇళ్లకు పట్టా కాగితాలు లేవన్నారు. అందుకే అప్పు వద్దని.. వడ్డీలు ఉండవని.. 10 వేలు కడితే ఇళ్లు వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తామంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో బకాయిలు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల మన్ననలు పొందేలా జగన్ పరిపాలన ఉందన్నారు.మండలి గ్యాలరీలోకి వచ్చి సమావేశాలు చూసిన చంద్రబాబుని గిన్నీస్ బుక్లో ఎక్కించాలన్నారు. మండలిలో వైసీపీకి బలం రావడం టీడీపీకి చెంపపెట్టు అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.