Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ఓటీఎస్‌ పూర్తి స్వచ్ఛందం : సీఎం జగన్‌

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌), గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటీఎస్‌ పూర్తి స్వచ్ఛందం అని మరోసారి స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాల సమస్యలు సృష్టించే ప్రయత్నంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని.. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కలిగించాలని సీఎం ఆదేశించారు. ఓటీఎస్‌ పథకం పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. 22-ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు.ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడిరచారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, ఫీల్డ్‌స్కెచ్‌, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌లు ఇస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పేదలపై దాదాపు 10వేల కోట్ల రూపాయల భారాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలను కూడా గత ప్రభుత్వం పరిశీలించలేదని విమర్శించారు జగన్‌. సుమారు 43 వేల మంది టీడీపీ హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని చెప్పారు. మరి ఇవాళ ఉచితంగా పట్టాలు ఇస్తామంటున్న వాళ్లు అప్పుడు ఎందుకు కట్టించున్నారని ప్రశ్నించారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్‌, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img