Friday, June 2, 2023
Friday, June 2, 2023

ఓటు వేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 9 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ హాలులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగుతుండగా.. ఏడుగురు వైఎస్సార్‌సీపీ, ఒకరు టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా.. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img