Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

కడప నుంచి అయిదు నగరాలకు ఇండిగో సేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి అయిదు నగరాలకు విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు నడపనుంది. . ఈ సేవలు మార్చి 27 నుంచి చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, అలాగే మార్చి 29 నుంచి విశాఖ, బెంగళూరుకు సర్వీలు ప్రారంభించనున్నట్లు ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో విమానాలతో అనుసంధానించిన వాటిలో దేశంలో73వ నగరంగా కడప నిలవనుందని ఇండిగో తెలిపింది.కోవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మెల్లమెల్లగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్‌ నుంచి కోలుకునే సమయంలోనే చమురు ధరలు పెరిగాయి.దీంతో ఏవియేషన్‌ సెక్టార్‌ ఇప్పుడప్పుడే గాడిన పడదు అనే వాదనలు వినిపించాయి. కానీ కడప లాంటి టైర్‌ త్రీ సిటీస్‌లో కూడా తిరిగి విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్‌ సెక్టార్‌ త్వరగా కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img