Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

కడియం నర్సరీలలో మొక్కలతో అద్భుతంగా జాతీయజెండా

నేడు యావత్‌ భారతదేశ ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంబరాన్ని తాకేలా జరుపుకుంటున్నారు. చిన్న- పెద్ద, పేద- ధనిక అన్న తారతమ్యం లేకుండా, కులమతాలకు అతీతంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎవరికి వారు తమ దేశభక్తిని తెలియజేసేలా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. దేశం పట్ల తమకు ఉన్న అమితమైన గౌరవాన్ని చూపిస్తున్నారు. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ కడియం నర్సరీ లలోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. వివిధ రకాల ఖరీదైన ఆకర్షణ మొక్కలతో సందేశాత్మక ఆకృతులను ఏర్పాటు చేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుతున్నారు. హర్‌ ఘర్‌ తిరంగా, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహణలో భాగంగా 75 వసంతాల జాతీయ జెండాతో కూడిన ఆకృతిని మొక్కలతో అద్భుతంగా రూపొందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img