జనసేన అధినేత పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తత అవశ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. . అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించాలని సూచించారు. విందులు, సమావేశాలను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమన్నారు. రాబోయే సంక్రాంతిని కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోవాలని కోరారు. ఇప్పటి వరకు టీకా తీసుకోనివారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఎంతో నష్టపోయామన్నారు.