జల్లి విల్సన్ ఉద్ఘాటన
విశాలాంధ్ర`కొల్లూరు(బాపట్ల): కష్టజీవుల హక్కులు కాపాడేందుకు అలు పెరగని పోరాటం చేయడంలో కమ్యూనిస్టులు ముందంజలో ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అన్నారు. మేడేను పురస్కరించు కుని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరులో సోమవారం జరిగిన వేడుకల్లో జల్లి విల్సన్ పాల్గొన్నారు. అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనం తరం జరిగిన బహిరంగసభలో జల్లి విల్సన్ మాట్లాడుతూ పేద, అణగారిన వర్గాలకు అండ, దండ కమ్యూనిస్టు లేనని చెప్పారు. అందరికీ న్యాయం కోసం కమ్యూ నిస్టులు పోరాడుతున్నారని చెప్పారు. శ్రమ జీవుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వ, పెత్తందారీ వ్యవస్థపై సీపీఐ చేసిన పోరాటాలు విజయవంతమ య్యాయన్నారు. భూస్వాములు, జమిందారీ వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడిరదని గుర్తుచేశారు. సీపీఐ పోరాట ఫలితంగా ఎంతోమంది వ్యవసాయ కూలీలకు భూములు దక్కాయని, వారంతా రైతులుగా మారా రన్నారు. సీపీఐ పేదల పార్టీ అని చెప్పారు. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరా సాగిస్తోందని జల్లి విల్సన్ చెప్పారు. తొలుత కొల్లూరు బస్టాండ్ సెంటర్‌లో రిక్షా కార్మికుల అధ్వర్యాన జెండాను ఆవిష్కరించిన జల్లి విల్సన్… కార్మిక పోరాటాల గురించి వివరించారు. చికాగో నగరంలో చిందిన కార్మికుల రక్తం నుంచి పైకి లేచిన ఎర్రజెండా ప్రపంచం దశదిశలా వ్యాపించి కార్మికుల హక్కుల రక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటాలకు అండగా నిలిచిందని జల్లి విల్సన్ గుర్తుచేశారు. పోరాటాలు, ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని కార్మికలోకానికి పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ప్రభుత్వాలకు మనుగడ కష్టమన్నారు. అనంతరం కొల్లూరుకు చెందిన సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గొరికపూడి జోసఫ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన సేవలు, త్యాగాలను కొనియాడారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు శింగరకొండ, సీపీఐ జిల్లా నాయకులు భావిరెడ్డి ప్రభాకరరావు, గంటా రాంబాబు, సీనియర్ నాయకులు నున్న సాంబయ్య, ఏఐటీయూసీ రిక్షా యూనియన్ నాయకులు గుంటూరు రమేశ్, యలవర్తి భూషణం, సీపీఐ నాయకులు మన్నే సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జోసఫ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.