Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కార్మికులు తక్షణమే విధులకు హాజరుకావాలి : మంత్రి ఆదిమూలపు సురేష్‌

మున్సిపల్‌ కార్మికులు సమ్మెను విరమింపచేసుకొని చర్చలలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. బుధవారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులు డిమాండ్లను ఒకటి తప్ప అన్నీ పరిష్కరించామన్నారు. రూ.18 వేల వేతనం చట్టబద్ధత కాదని తెలిపారు. దానిపై కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కార్మికులు తక్షణమే విధులకు హాజరుకావాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజ్ణప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img