Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవచ్చు. ..అంతేగానీ ఇలా అంటారా?

ఏపీ పరిస్థితులపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందన
ఏపీలో రోడ్లు,నీళ్లు, కరెంటుపై చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.తాను హైదరాబాద్‌లోనే ఉండి వస్తున్నానని.. అక్కడ కరెంటు లేదని.. తాను అక్కడ జనరేటర్‌ పెట్టుకుని ఉండాల్సి వచ్చిందన్నారు. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. ‘ఆయనకు ఆయన ఫ్రెండ్‌ చెప్పాడు… నేను హైదరాబాద్‌లో ఉండి వస్తున్నా. అక్కడ కరెంటే లేదు. నేను కూడా అక్కడ జనరేటర్‌ పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవచ్చు. అంతేగానీ ఇలా అంటారా? ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడోచ్చా? ఆయన తన వ్యాఖ్యలను విత్‌ డ్రా చేసుకోవాలి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img