Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కుప్పంలో జగన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం : తులసిరెడ్డి

కుప్పంను పులివెందులతో సమానంగా అభివృద్ది చేస్తానని సీఎం జగన్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని ఏపీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… పులివెందుల్లో ప్రజల ధన, మాన, ప్రాణాలకే రక్షణ లేదన్నారు. వైఎస్‌ వివేకా కుమార్తె , జగన్‌ చెల్లెలు అయిన సునీత కుటుంబానికే పులివెందులలో రక్షణ లేదని… అటువంటి పులివెందులను సీఎం మిగతా నియోజకవర్గాలతో పోల్చుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళాభ్యుదయం గురించి సీఎం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చేయూత, ఆసరా, అమ్మ ఒడి ఇవన్నీ నాన్న బుడ్డీకి చాలడం లేదని విమర్శించారు. మట్టిముంత ఇచ్చి వెండిచెంబు దొంగలించినట్లు ఉంది వైసీపీ తీరు అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img