Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కుప్పం పర్యటనకు చంద్రబాబు..

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన కాసేపటి క్రితం బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం మీదుగా ఆయన కుప్పం చేరుకుంటారు. విద్యుత్‌ చార్జీలతో పాటు ఆర్జీసీ చార్జీలను పెంచడంపై జగన్‌ సర్కారు తీరును నిరసిస్తూ బాదుడే బాదుడు పేరిట టీడీపీ నిరసనలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో నిర్వహించనున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో పాలుపంచుకునేందుకే చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పంతో పాటు నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం, గుడిపల్లె మండలాల్లోనూ చంద్రబాబు పర్యటించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img