రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిపై మంగళవారం సీఎం జగన్ సమీక్షించారు. పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే ఈ సందర్భంగా విపక్షాలపై మండిపడ్డారు. తాము అభివృద్ధి పనులు చేపడుతుంటే, విపక్షనేతలు ఆ పనులకు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, కేసుల సాయంతో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు లభించకుండా చేయాలని కంకణం కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు ఈ తరహా అజెండాతో పనిచేస్తున్నప్పటికీ, తాము ఎక్కడా మడమ తిప్పడంలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు నిధుల లోటు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను ఎంత కష్టమైనా సరే పూర్తిచేస్తున్నామని అన్నారు.