Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదు : బుగ్గన

పెట్రో ధరల తగ్గింపునకు కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. పెట్రో ధరలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరు, కేంద్రానికి ఉండేవి వేరని, ఇప్పటికే పెంచిన పన్నును కొంతమేర తగ్గించినట్లు తెలిపారు. ధిల్లీి పర్యటనలో ఉన్న ఆయన సోమవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అన్‌ రాక్‌ ఆర్బిట్రేషన్‌ పరిష్కారానికి సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రితో చర్చించానన్నారు. నూతనంగా ఆర్ధిక శాఖ సహాయ మంత్రులుగా నియమించబడిన మంత్రులు భగవత్‌ కరాడ్‌, పంకజ్‌ చౌదరిని మర్యాద పూర్వకంగా కలిశానన్నారు. సహాయ మంత్రులకు రాష్ట్ర పరిస్థితులు వివరించినట్లు చెప్పారు.పెట్రోల్‌ డీజిల్‌ ధరలపై రాష్ట్ర నిర్ణయం ఇప్పటికే తెలిపామని, రాష్ట్ర ఆర్ధిక వనరుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని బుగ్గన అన్నారు.పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపుపై ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.రాష్ట్రానికి పెట్రోల్‌, ఎక్సైజ్‌ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందని, కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img