Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

కొత్త పార్టీలు రావడం సహజం.. : సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి ఏ పార్టీ అయినా రావొచ్చని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల్లో తమకు పాజిటివ్‌ ఇంపాక్టే ఉందన్నారు. కొత్త పార్టీలు రావడం సహజమన్నారు. ప్రజా అజెండాతో పార్టీలు వచ్చి పనిచేస్తే జనానికి మంచిదన్నారు. చివరకు తేల్సాల్చింది ప్రజలేనన్నారు. కొత్త పార్టీల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము ఆటగాళ్లమని, తమ గేమ్స్‌ రూల్స్‌ ప్రజా అజెండా మేరకే ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img