Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

కోటంరెడ్డిపై కిడ్నాప్‌ కేసు నమోదు

కార్పొరేటర్‌ విజయభాస్కర్‌ రెడ్డిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారని కేసు
వైసీపీ అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిపై కిడ్నాప్‌ కేసు నమోదయింది. తన అనుచరులతో కలిసి కార్పొరేటర్‌ మూలే విజయభాస్కర్‌ రెడ్డిని కిడ్నాప్‌ చేశారంటూ వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వేదాయపాలెం ఇన్స్‌ పెక్టర్‌ కె. నరసింహారావు వెల్లడిరచిన వివరాల ప్రకారం… వైసీపీని వీడి తనతో రావాలంటూ నెల్లూరు 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ విజయభాస్కర్‌ రెడ్డికి నిన్న కోటంరెడ్డి ఫోన్‌ చేసి కోరారు. అయితే విజయభాస్కర్‌ రెడ్డి దానికి నిరాకరించడంతో… తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్‌, డ్రైవర్‌ అంకయ్యతో కలిసి వెళ్లి ఆయనను బెదిరించారు. కార్పొరేటర్‌ ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా, ఆయన తప్పించుకుని వేదాయపాలెం పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img