Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కోడి కత్తి కేసు.. సీజేఐకి నిందితుడి తల్లి లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ తల్లి సావిత్రమ్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు లేఖ రాశారు. నాలుగు సంవత్సరాల నుంచి తన కుమారుడిని రిమాండ్‌ ఖైదీగానే ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే శ్రీనివాస్‌ను విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏకానీ, న్యాయస్థానం కానీ ఎటువంటి విచారణ జరపడంలేదని వెల్లడిరచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై శ్రీనివాస్‌ కోడి పందేల్లో వాడే కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. 2018లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర అనంతరం జగన్‌.. హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. శ్రీనివాస్‌ అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img