గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
గుడివాడలో క్యాసినో జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ నిజనిర్థారణ కమిటీ అక్కడ పర్యటించింది.తాజాగా ఈ వ్యవహారంపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. క్యాసినో వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాని కోరారు. కాగా సంక్రాంతి సందర్భంగా నానికి చెందిన కల్యాణమండపంలో క్యాసినో, జూదం నిర్వహించారని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. వాస్తవాలను కనుగొనేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ వెళితే కార్లు ధ్వంసం చేశారని, తిరిగి తమ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గురువారం గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసింది. ఈమేరకు గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్‌కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. అదేవిధంగా గుడివాడ పర్యటనలో తమపై జరిగిన దాడులు, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేశారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా తదితరులు ఉన్నారు.