Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

గవర్నర్‌ హరిచందన్‌ను కలిసిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించడంపై.. టీడీపీ బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను గవర్నర్‌ దృష్టికి తెచ్చామన్నారు. 1986లో హెల్త్‌ యూనివర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపించారని చంద్రబాబు చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ తీసుకువచ్చామన్నారు. టీడీపీ హయాంలో 18 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం జగన్‌రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ చీకటి జీవో తెచ్చారని, హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేంతవరకూ పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img