Monday, December 5, 2022
Monday, December 5, 2022

గురుకులాలను జగన్‌ సర్కారు పట్టించుకోకపోవడం లేదు : లోకేష్‌

విజయనగరం జిల్లా, కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం తీవ్ర విచారకరమన్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సొంత నియోజకవర్గంలో జరిగిందన్నారు. పిల్లల్ని సురక్షితంగా చూసుకోవాల్సిన గురుకులాలను జగన్‌ రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img