Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి

గోదావరి వరదలపై సీఎం జగన్‌ సమీక్ష
ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, మరిన్ని కీలక నిర్ణయాలివే

గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం.. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఎక్కడ కూడా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.గోదావరి వరదలు, ప్రస్తుత పరిస్థితుల్లో మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికిన అన్నికుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్‌, కేజీ ఉల్లిపాయలు అందించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని ఉన్నతాధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img