Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

గౌతమ్‌ సవాంగ్‌ బదిలీ..ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి


ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం గౌతమ్‌ సవాంగ్‌కి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. రాజేంద్రనాథ్‌రెడ్డి స్వస్థలం కడప జిల్లా రాజుపాళెం మండలం పర్లపాడు. కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడిరది. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేస్తున్నారు. గతంలో విజయవాడ సీపీగా.. విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీస్‌లో జాతీయస్థాయిలో రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు పొందారు. మరోవైపు ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేస్తూ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img