Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి

: సీఎం జగన్‌
రాష్ట్రంలో కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం జగన్‌ బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్‌ ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా వ్యాక్సిన్లు వృధా కాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. టీచర్లు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచనలు చేయాలని చెప్పారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్‌ కోడ్‌ రూపంలో అందుబాటులో ఉండాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img