గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ వెల్లడిరచారు. ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలు మాత్రమే ఉంటాయని, సీబీఏఎస్ పరీక్షలతో పాటు మిగతా ఇతర అదనపు పరీక్షలు ఉద్యోగులకు నిర్వహించబోమని స్పష్టం చేశారు.