Monday, January 30, 2023
Monday, January 30, 2023

గ్రీన్‌ ఛానల్‌ సక్సెస్‌.. విశాఖ టూ తిరుపతి గుండె తరలింపు..

తిరుపతిలోని టిటిడికి చెందిన శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ కేర్‌ హాస్పిటల్‌ వైజాగ్‌ కు చెందిన ఒక బ్రెయిన్‌ డెడ్‌ మహిళకు చెందిన గుండెను అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక 15 ఏళ్ల బాలుడికి అమర్చే అరుదైన ఆపరేషన్‌ శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నం షీలా నగర్‌ కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి హార్ట్‌ ను తిరుపతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌ కు తరలించారు. విశాఖ కిమ్స్‌ నుంచి ఎయిర్‌ పోర్ట్‌ వరకు పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. హార్ట్‌ తరలించే వాహనానికి ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా విశాఖ పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో త్వరగా ఎయిర్‌ పోర్టుకు చేరుకునేలా కృషి చేశారు. విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి పోలీసుల బందోబస్తు ద్వారా ఎక్కడా కూడా ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా తిరుపతి పద్మావతి హార్ట్‌ సెంటర్‌ కు మధ్యాహ్నం వరకు చేరుకుంది. దానం చేసిన బ్రెయిన్‌ డెడ్‌ పేషెంట్‌ సన్యాసమ్మ గుండె ఆసుపత్రికి చేరుకోగానే అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన నరసయ్య, రాధమ్మల కుమారుడు 15 ఏళ్ల విశ్వేశ్వరయ్యకు అమర్చే ఆపరేషన్‌ మొదలైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img