Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేక్‌లు కట్‌ చేస్తూ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రుల సమక్షంలో సీఎం జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. సీఎంను కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆదిమూలపు సురేష్‌, నారాయణస్వామి పాల్గొన్నారు. అలాగే తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్‌ కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img