Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

చంద్రబాబుకు మంత్రి బొత్స కౌంటర్‌ ..

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. తనకు ఇవే చివరి ఎన్నికలన్న చంద్రబాబు వ్యాఖ్యలు వాస్తవమని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు పడాలన్నా.. అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు రాకూడదని తెలిపారు. దేవుడి దయతో గతంలో చంద్రబాబుకు సీఎం పదవి వచ్చిందన్నారు. తనను అవమానించారని చంద్రబాబే అనుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ ఆయనను ఎవరూ అవమానించలేదని వెల్లడిరచారు. చంద్రబాబు సానుభూతి కోసమే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంతరం చంద్రబాబు ఏం మాట్లాడినా తమకు ఆశీస్సులేనన్నారు. ప్రజలే తమకు న్యాయనిర్ణేతలని.. చంద్రబాబు కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img