Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని విమర్శలు

ప్రజలు చంద్రబాబు పిలక కత్తిరించారని సెటైర్లు
బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారా..? అని నిలదీత

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. బీసీలకు ఆత్మగౌరవం కల్పించారని.. సభాపతి తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలకు సమున్నత స్థానం కల్పించారని చెప్పారు. బీసీలకు అనేక పదవులిచ్చి ప్రొత్సహించింది జగన్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు ఇచ్చి.. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారని వివరించారు. బీసీలంతా ఆలోచించుకుని.. జగన్‌ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. విజయవాడలో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న బీసీ మహాసభలో మాట్లాడిన స్పీకర్‌.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. తోకలు కత్తిరిస్తాను అన్నందుకే.. చంద్రబాబు పిలక కత్తిరించి, గుండుకు సున్నం రాశారని.. స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యానించారు. చరిత్ర తెలియని వాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడు యాదవ బీసీ, వాల్మీకి బోయ బీసీ, రాముడు గుహుడు జాలరి బీసీ, భీష్ముడు గంగా పుత్రుడు, చరిత్ర తెలియని వాళ్లు తోకలు కత్తిరిస్తారా? అని ఫైర్‌ అయ్యారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారా? అని స్పీకర్‌ తమ్మినేని ప్రశ్నించారు. బీసీల దెబ్బ ఏంటో చంద్రబాబుకు తెలుసన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారని ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపైనా స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు.. నీ నాలుక తెగుతుంది.. నీ నాలుక చీలిక అవుతుందని సంచలన కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు చరిత్ర తిరిగి రాయనున్నారన్నారని జోస్యం చెప్పారు. మోసం చేయడానికి మారువేషాల్లో వస్తున్నారు జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెప్పాలి అని తమ్మినేని పిలుపునిచ్చారు. బీసీలకు ఎవరు ఏం చేశారో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌ చేసిన మంచిని మరువొద్దని కోరారు.వెనుకబడిన వర్గాలే వెన్నెముక.. నినాదంతో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న మహాసభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు తరలివచ్చారు. జయహో బీసీ.. అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు విజయవాడకు వచ్చారు. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో మహాసభకు వచ్చేవారికి స్వాగతం పలుకుతూ.. పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. బీసీ మహాసభకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మంగళవారమే బీసీల ర్యాలీలు బయలుదేరాయి. దీంతో విజయవాడ వీధులు కిక్కిరిసిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img