Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట : వల్లభనేని వంశీ

చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గతంలో తెలంగాణాలో స్టీఫెన్ సన్ కొలుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందేనని.. ఓటుకి నోటు కేసులో పట్టుబడి అర్ధరాత్రి అమరావతి వచ్చింది చంద్రబాబు కాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రలోభ పెట్టడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యని.. గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి గెలిచారన్నారు. చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడడం అలవాటని.. టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది అధిష్టానం గుర్తించిందన్నారు.బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవన్నారు వంశీ. సినిమాలో అన్ని డూపుల్ని అమర్చినట్లు వారి మాటలు కూడా డూపులు అంటూ సెటైర్లు పేల్చారు. సినిమాకి, రాజకీయానికి చాలా తేడా ఉంటుందని.. సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచింది అందరూ చూశారన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ గెలిచిందని.. కేవలం చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకే టీడీపీ గెలిచిందన్నారు.మాజీ బాస్‌కు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఎలాగో బాగా తెలుసని.. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని తెలిసే చంద్రబాబుతో నలుగురు బేరం కుదుర్చుకున్నారని వంశీ విమర్శించారు. మొన్న తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారని.. ఏపీలో కూడా 175 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని.. వారు జరిగేవి చెప్పాలి కదా అంటూ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img