Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అని అనుకోవడం లేదు : ఉండవల్లి

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్‌ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించి తీవ్రంగా ఖండిరచారు. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. రాజమండ్రిలో మీడియా మీట్‌ నిర్వహించిన ఆయన..చంద్రబాబునాయుడు కన్నీరు పెట్టుకోవడం ఓ డ్రామాగా తాను భావించడం లేదన్నారు. అయితే ఆయన అంతగా స్పందించాల్సినంత అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. ‘ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి నేనెప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదు. హరికృష్ణ, పురందేశ్వరితో నాకు పరిచయం ఉంది, వాళ్లు చాలా మంచివారు. చాలా గౌరవంగా మాట్లాడుతారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అని అనుకోవడం లేదు. చంద్రబాబుకు తెలియదా.. సింపతీ పనిచేయదని..?. చంద్రబాబు అంతలా స్పందించాల్సిన సమస్య కానేకాదు. ఓ మంత్రి అయితే రేయ్‌, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయింది. చంద్రబాబును అంతలా దారుణంగా తిడితే ఎవరు గౌరవిస్తారు?. విపక్ష నేతలు, మనుషులకు వైసీపీ మంత్రులు గౌరవించాలి. విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు భజన చేశారు.’ అని అన్నారు. ఉన్నతమైన సభలో గౌరవంగా మాట్లాడితేనే..అందరూ వారికి తిరిగి అదే గౌరవం ఇస్తారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img