Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

చంద్రబాబు కుప్పంలో పర్యటించిన 15 రోజులు బ్లాక్‌ డేనే.. : మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం చంద్రబాబుకు తెలియదా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ళలో కుప్పంకు కేవలం 6 సార్లు మాత్రమే చంద్రబాబు వచ్చారని పేర్కొన్న పెద్దిరెడ్డి.. 30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థిని శూన్యం అన్నారు. కుప్పంలో పెండిరగ్‌ లో ఉన్న తాగు – సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కుప్పంలో చంద్రబాబు పేదల కోసం కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు కుప్పం పర్యటనపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ కార్యకర్తలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. మూడు రోజుల చంద్రబాబు పర్యటనలో అధికంగా గాయపడిరది వైసీపీ కార్యకర్తలేనని.. బయటి వ్యక్తులను తీసుకొచ్చి మా పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందుతున్నాయి కనుక వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 7 వేల ఇళ్లను నిర్మించి ఇచ్చిందని, త్వరలో మరో 3 వేల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పంలో ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా..? అని చంద్రబాబును మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నారా లోకేష్‌ మంగళగిరిలోనే ఘోరంగా ఓడిపోయారు. కుమారుడు లోకేష్‌ను గెలిపించుకోలేని వ్యక్తి చంద్రబాబు.. తన హోదాను తానే దిగజార్చుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా ఏపీ ప్రభుత్వ పనులను అడ్డుకోవడం మానివేయాలని, కుప్పంలోనూ ఉన్న పేరు పోతుందంటూ హెచ్చరించారు.
చిత్తూరులో అన్ని స్థానాలు గెలుస్తాం..
‘చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుస్తాం. వైసీపీలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తున్నాడు. చంద్రబాబు కుప్పంలో పర్యటించిన 15 రోజులు బ్లాక్‌ డేనే. నీతి మాలిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. టీడీపీ అధినేత మానసిక పరిస్థితి బాగా లేదు. చంద్రబాబును వెంటనే కుటుంబ సభ్యులు వైద్యుడికి చూపించాలి. నిబద్ధత లేని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గెలిపించరని’ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img