Friday, August 19, 2022
Friday, August 19, 2022

చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..

విభజన హామీల అమలు కోసం పోరాడాలని చంద్రబాబు దిశానిర్దేశం
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంటులో పార్టీ సభ్యులుగా కొనసాగుతున్న నలుగురు ఎంపీలు హాజరయ్యారు.టీడీపీ తరఫున రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్‌ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక లోక్‌ సభలో టీడీపీకి ముగ్గురు సభ్యులున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడులు టీడీపీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఈ నలుగురు శుక్రవారం నాటి టీడీపీపీ భేటీకి హాజరయ్యారు. ఏపీ విభజన హామీల అమలు కోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాటం కొనసాగించాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img