Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

చంద్రబాబు, పవన్‌ ముసుగు తొలగిపోయింది.. మంత్రి కారుమూరి

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ముసుగు తొలగిపోయిందని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి కారుమూరి కౌంటరిస్తూ పవన్‌ దత్తపుత్రుడన్నది నిన్నటితో తేలిపోయిందన్నారు. పవన్‌ కు చంద్రబాబు సంఫీుభావం ఎందుకు తెలపాలని ప్రశ్నించారు. యువతకు పవన్‌ రౌడీయిజం నేర్పిస్తున్నారా అన్నారు. దోచుకోవడం, దాచుకోవడంలో చంద్రబాబు ముందుంటారన్నారు. తనను నమ్ముకున్న యువతకు పవన్‌ అన్యాయం చేయొద్దన్నారు. కాపుజాతిని అవమానించిన చంద్రబాబును ఎందుకు మోస్తున్నారని అన్నారు. దుర్మార్గాలు చేసే చంద్రబాబుకు ఎందుకు కొమ్ము కాస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img