Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

చంద్రబాబు సభలను అడ్డుకోవడం పై టిడిపి నిరసన

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో చంద్రబాబు సభను పోలీసులు అడ్డుకోవడంపై శనివారం ఉరవకొండలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ చంద్రబాబు సభలను అడ్డుకోవడం ప్రభుత్వ అరాచకత్వానికి, నిరంకుశత్వానికి అద్దం పడుతోందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టడం జగన్ ఫ్యూడల్ మనసత్వానికి అద్దంపడుతున్నాయని విమర్శించారు. పోలీసులతో తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవాలనుకోవడం హేయనీయం అని వారు పేర్కొన్నారు. ప్రజల్లో వైసిపి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయారన్న విషయం ఈ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకుడి పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి జగన్ భయపడుతున్నారని అన్నారు అనపర్తి సభకు జిల్లా పోలీసుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా అకారణంగా సభకు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం నియంత పాలనకు నిదర్శనం ఉన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకి చెందిన టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img