Friday, December 2, 2022
Friday, December 2, 2022

చంద్రబాబు హయాంలో తూతూ మంత్రంగా..మహిళా కమిషన్‌ : వాసిరెడ్డి పద్మ

మహిళా కమిషన్‌ కన్నీరు పెట్టుకోవడానికి లేదని.. కన్నీరు తుడవడానికి ఉందని రాష్ట్ర మహిళ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ నేత బొండా ఉమకు నోటీసులు జారీ చేయడానికి మీడియాకు వివరించారు. చంద్రబాబు హయంలో మహిళ కమిషన్‌ను తూ తూ మంత్రంగా, ఆటబొమ్మలా తయారు చేశారని విమర్శించారు. మహిళ కమిషన్‌ సుప్రీం ఆ… అని బోండా ఉమ లాంటి ఆకు రౌడీ అన్నారన్నారు. ‘‘అవును సుప్రీం నే….మీ హయంలో మహిళ కమిషన్‌ కన్నీళ్లు పెట్టుకోవడానికి ఉంది…. ఇప్పుడు కన్నీళ్ళు తుడవడానికి ఉంది. బాధిత మహిళల పట్ల ఎలా వ్యవహరించాలి చంద్రబాబుకు తెలియదా. నా పట్ల అమర్యాదగా వ్యవహరించాక సన్మానం చేయాలా… సమన్లు ఇవ్వాలా. మీరు ఏమైనా దేవుళ్ళా… అత్యాచార బాధితురాలి దగ్గర మీరు అలా వ్యవహరిస్తారా. మీ వ్యవహారానికి సంజాయిషీ చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది.’ అని అన్నారు. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్‌ తూతూ మంత్రంగా ఉందని.. బాధితురాలికి ధైర్యం ఇవ్వకపోతే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా తానేం చేయాలి..? అని అడిగారు. చంద్రబాబు , బోండా ఉమా నోటీసులు తీసుకుని మహిళా కమిషన్‌కు సమాధానం చెప్పాలన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బొండా ఉమాలకు వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కార్యాలయంలో జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img