Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

చర్చలతోనే సమస్య పరిష్కారం..లేకపోతే లేనిపోని అపోహలు : సజ్జల

చర్చల వల్లే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్‌ కాదని అన్నారు. ఈ రోజు కూడా పీఆర్‌సీ సాధన కమిటీ వాళ్ళు చర్చలకు రాలేదని తెలిపారు. తమ పిలుపు మేరకు కొన్ని సంఘాల నాయకులు వచ్చారని, సమస్యలు ప్రస్తావించారని పేర్కొన్నారు. చర్చలకు ఎవరు వచ్చినా మాట్లాడుతామన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమేనని, ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని అన్నారు. చర్చల వల్లే సమస్య పరిష్కారమవుతుందని లేకపోతే లేనిపోని అపోహలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మూడు రోజులు ఆలస్యమైందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img