అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్
‘చలో తాడేపల్లి’ కి అనుమతి లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఈ నెల 19న తలపెట్టిన చలో తాడేపల్లికి అనుమతి లేదని, తాడేపల్లి పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. ఆందోళన చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాబ్ జాబ్ క్యాలెండర్ సాధనకు ఈ నెల 19న చలో సీఎం క్యాంపు కార్యాలయం నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థుల ఆందోళనలకు టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలిపాయి.