Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

చిత్తూరు జిల్లాలో దారుణం.. మైనర్‌ బాలికపై అత్యాచారం..

చిత్తూరు జిల్లాలో సోమల(మం)నంజంపేటలో దారుణం చోటుచేసుకుంది.. ఒక మైనర్‌ బాలిక పై 22 ఏళ్ల రాజేశ్‌ అనే యువకుడు దాదాపు ఆరేడు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్న వైనం బుధవారం వెలుగులోకి వచ్చింది. భయంతో ఎవరికీ చెప్పకపోయినా శారీరక మార్పులను గుర్తించిన తల్లిదండ్రులు వైద్య పరీక్ష చేయించడంతో ఆ బాలిక 5 నెలల గర్భిణీ అని తేలింది. ఆపై కారకులెవరో తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు రాజేశ్‌ పరారీలో ఉన్నాడని, వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img