Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ఈ సమావేశంలో ఇరువురూ పలు విషయాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్టు చెపుతున్నారు. మరోవైపు చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవికి అభినందనలు తెలిపేందుకు గంటా శ్రీనివాసరావు వచ్చినట్టు ఆయన అనుచరులు చెపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ భేటీకి సంబంధించిన వివరాలపై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img