Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

చిరంజీవిని చూస్తే ఏడుపొచ్చింది : జేసీ ప్రభాకర్‌ రెడ్డి

సినీ పరిశ్రమపై కక్ష సాధింపు వద్దని, అలా చేస్తే ఏం సాధిస్తారని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు బ్రతికే పరిస్థితి లేదన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని దుయ్యబట్టారు. జగన్‌ చర్యలతో పవన్‌కు ఏం కాదు.. నిర్మాతలకే ఇబ్బందని తెలిపారు. పవన్‌ను ఏం చేయలేక.. సినిమా వారిపై పడ్డారా? అని ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు.ఇంకెంతమందిని జగన్‌రెడ్డి వేధిస్తారని నిలదీశారు.‘చిరంజీవి గారిని చూస్తే ఏడుపొచ్చింది. కింది స్థాయి నుంచి స్వయంకృషితో పైకొచ్చిన వ్యక్తి ఆయన. దీనాతి దీనంగా చేతులు జోడిరచి మిమ్మల్ని అడిగారు. ఆ పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు. చిరంజీవి సైతం చేతులు జోడిరచి ప్రాథేయపడాలా? ఆయనకు ఏం తక్కువ. ఆయన చేతులు జోడిరచి అడిగారంటే ఆయన బతుకుతెరువు కోసం కాదు. ఆయన్ను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం అడిగారు.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img